బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన అభిమానులు

55
- Advertisement -

మెగా స్టార్ చిరు బాబీ బిగ్ ఫ్యాన్. బాలయ్య కి గోపీచంద్ మాలినేని పెద్ద అభిమాని. ఇక ఎన్నో ఏళ్ల నుండి ఎదురుచూస్తున్న వీరికి తమ అభిమాన హీరోలు పిలిచి ఛాన్స్ ఇవ్వడంతో వారికి రిటర్న్ గిఫ్ట్ గా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించారు. నిజానికి ఈ ఇద్దరికీ ఈ సినిమాలు పెద్ద టాస్కే. ‘ఖైదీ 150’ తర్వాత చిరుకి బ్లాక్ బస్టర్ పడలేదు. ‘ఆచార్య’ ప్రేక్షకులతో పాటు మెగా ఫ్యాన్స్ ను కూడా నిరాశ పరిచింది. ఇక ‘గాడ్ ఫాదర్’ పర్లేదు అనిపించుకున్నా భారీ వసూళ్లు రాబట్టలేకపోయింది. దీంతో మేకర్స్ మూడు రోజుల కలెక్షన్స్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ ఎఫెక్ట్ బాబీ పై పడింది. ఈ సినిమాకు సంబంధించి బాబీపై తీవ్ర ఒత్తిడి నెలకొంది.

ఫ్యాన్స్ ‘ఆచార్య’ మర్చిపోయే రేంజ్ హిట్ సినిమా ఇవ్వాలి. కలెక్షన్స్ లో మెగా స్టామినా ఏ మాత్రం తగ్గలేదని మళ్ళీ రుజువు చేయాలి. ఇవి బాబీ ముందు ఉన్న టాస్కులు. ఇవన్నీ ఆలోచించి తన అభిమాన హీరో ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందో లెక్కలు వేసుకొని అదే కొలమానంతో ‘వాల్తేరు వీరయ్య’ తీశాడు. కంటెంట్ లో కొత్తదనం లేదనేది పక్కన పెడితే అభిమానులకు మాత్రం వింటేజ్ చిరును చూపించి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు బాబీ. ప్రస్తుతం వీరయ్య 100 కోట్ల షేర్ దిశగా అడుగులేస్తున్నాడు.

ఇక గోపీచంద్ మాలినేని మీద కూడా వీర సింహా రెడ్డి విషయంలో భారీ ఒత్తిడి ఉంది. ‘అఖండ’ తో బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్య కి మరో సక్సెస్ ఇవ్వాలి. అలాగే ‘క్రాక్’ తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన తన కెరీర్ ను అదే రేంజ్ లో కంటిన్యూ చేయాలి. ఇలా గోపీచంద్ కి కోడా చాలానే టెన్షన్స్ ఉన్నాయి. ఫైనల్ గా బాలయ్యను ఎలా చూపిస్తే ఇటు ఫ్యాన్స్ అటు ఆడియన్స్ మెప్పు పొందగలడో తెలుసుకొని ఆ లెక్క ప్రకారం కమర్షియల్ ఫార్మెట్ మీటర్ పెట్టుకొని ‘వీర సింహా రెడ్డి’ తీశాడు. బాలయ్య నుండి ఫ్యాన్స్ ఆశించే పవర్ ఫుల్ డైలాగులు , అదిరిపోయే యాక్షన్ ప్లాన్ చేసుకొని సినిమాను సేఫ్ జోన్లోకి తీసుకెళ్ళి మంచి వసూళ్లు రాబట్టాడు గోపీచంద్.

అయితే తమ అభిమానులకి సీనియర్ హీరోలు చిరు , బాలయ్య ఛాన్స్ ఇచ్చి సినిమాలు చేస్తే సంక్రాంతి కి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన తమ మీద పెట్టుకున్న నమ్మకానికి 100 కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్స్ అందించి అభిమనులా ? మజాకా అనిపించారు. ఈ అభిమనులిద్దరికీ సంక్రాంతి సీజన్ కూడా గట్టిగా కలిసొచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్స్ అందుకున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -