ఘాజి దర్శకుడితో వరుణ్ తేజ్

211
Sankalp Reddy to team up with Varun Tej
- Advertisement -

‘ఫిదా’ చిత్రంతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించాడు మెగా హీరో వరుణ్ తేజ్. కెరియర్ స్టార్టింగ్‌లో డిఫరెంట్ జానర్స్‌లో వైవిధ్య పాత్రలు చేసినా.. ఫిదా చిత్రంలో లవర్ బాయ్‌గా ప్రేక్షకులకు కనెక్ట్ కావడంతో మళ్లీ ప్రేమకథా చిత్రంతోటే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వరుణ్ తేజ్, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘తొలిప్రేమ’ చిత్రం ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.

ఈ సినిమా తర్వాత ఘాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డితో సినిమా చేయనున్నాడు. అంతరిక్షం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ చిత్రం షూటింగ్ మే నుంచి ప్రారంభంకానుంది. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా తెరకెక్కనున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట.

 Sankalp Reddy to team up with Varun Tej

అయితే ఇప్పటికే వరుణ్, సంకల్ప్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమాకు నిర్మాత ఎవరన్నది ఇంకా కన్ఫామ్ కాలేదు. తన తొలి చిత్రాన్ని నిర్మించిన పీవీపీ సంస్థకే రెండో సినిమా చేసేందుకు సంకల్ప్ ఆసక్తికనబరుస్తున్నారు. దీనిపై త్వరలో అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.

- Advertisement -