- Advertisement -
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. సంజీవ్ ఖన్నా ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా నియామకం చేశారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వచ్చేనెల 11వ తేదీన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గా ప్రమాణస్వీకారం చేయనున్నారు జస్టిస్ సంజీవ్ ఖన్నా.
సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా కాగా వచ్చేనెల 10న పదవీ విరమణ చేయనున్నారు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి డివైచంద్ర చూడ్. తన స్థానంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును సిఫార్సు చేశారు జస్టిస్ చంద్ర చూడ్.
2025 మే 13 వరకు భారత ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఈ మేరకు ఎక్స్ లో వెల్లడించారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘావాల్.
Also Read:చంద్రబాబు తెలంగాణకు రావొద్దు..కాంగ్రెస్ ఎమ్మెల్యే!
- Advertisement -