- Advertisement -
ప్రధాని పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రజలందరూ లైట్లు ఆపివేసి కొవ్వొత్తులు వెలిగించే కార్యక్రమం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది కేంద్ర విద్యుత్ శాఖ. అన్ని రాష్ట్రాల విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి సంజీవ్ నందన్ సాహ్లి లేఖ రాశారు.
కేవలం లైట్లు మాత్రమే ప్రధాని ఆపమని చెప్పారని, ఇంట్లో ఉండే ఇతర పరికరాలైన ఫ్రిడ్జ్, ఏసీ, టీవీలు ఆపమని చెప్పలేదని ప్రజలకు స్పష్టం చేసింది కేంద్రం.
ఎవరూ ఆందోళన చెందవద్దని.. లైట్లు ఆపడం తప్ప మిగిలినవన్నీ కొనసాగించుకోవచ్చని ప్రజలకు సూచించారు. గ్రిడ్‌పై ఒకేసారి ప్రభావం పడకుండా.. డిస్పాచ్ కేంద్రం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు రాష్ట్ర విద్యుత్ శాఖ కార్యదర్శి.
- Advertisement -