ఆన్‌లైన్‌లో కరెంట్ బిల్లులు చెల్లించండి..

87
prabhakar rao

కరెంట్ బిల్లులు ఆన్ లైన్‌ చెల్లించాలని ప్రజలకు సూచించారు టీఎస్ జెన్‌కో,ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు. రేపటి లాక్ డౌన్ నేపథ్యంలో రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్స్ అపుచేయడం కోసం తెలంగాణ విద్యుత్ సంస్థలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాయని చెప్పారు.

రేపు రాత్రి తొమ్మిది గంటలకు 9 నిమిషాల పాటు లైట్స్ అపుచేసుకోవచ్చన్నారు. నిరంతరం విద్యుత్ ను సప్లై చేయవచ్చు గ్రిడ్ కు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.ఈ మధ్యలో సూర్యగ్రహణం వచ్చినప్పుడు కూడా ఇలానే లైట్స్ ఆపడం జరిగింది ఆ సమయంలో 800 మెగా వాట్స్ వినియోగం ఉండే అదికూడా ఆపడం వలన ఎలాంటి ఇబ్బంది గ్రిడ్ కు రాలేదన్నారు.

చాలా సమర్థవంతంగా మనం ఎదుర్కొన్నాం,ప్రజలు ఇలాంటి వదంతులు నమ్మవద్దు,యధావిధిగా పీఎం ,సీఎం కేసీఆర్ సూచనల మేరకు లైట్స్ ఆఫ్ చేసి మిగతా వాటిని నిరంతరం వాడుకోవాలన్నారు.

వర్షా కాలం లో కూడా ఇలానే ఇబ్బంది వచ్చింది మన తెలంగాణ రాష్ట్రం లో సాంకేతికంగా ముందు ఉన్నాం అన్నారు. గ్రిడ్ సేఫ్టీ చాలా బాగా ఉంది.ఎవరు ఇబ్బందులు గురికావద్దన్నారు.

లైటింగ్ మాత్రమే ఆప్ చేయండి కానీ ఇతర ఫ్రిడ్జ్,ఫ్యాన్స్ యధావిధిగా వాడుకోవచ్చన్నారు. మనకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఉంది దాని ద్వారా పంప్ లు ఆన్ చేసుకోవచ్చు ఇక్కడి విద్యుత్ ను అక్కడ వాడుకోవచ్చు అవసరం అయితే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ రివర్స్ పంపింగ్ ను ఆన్ చేస్తాం.మన రాష్ట్రంలో చాలా ఇంప్రూవ్ టెక్నాలజీని వాడుతున్నాం అన్నారు.

మనకు ఐసోలేటెడ్ సిస్టం ఉంది ఎలాంటి ఇబ్బంది లేకుండా కరోన కట్టడికి పీఎం,సీఎం కేసీఆర్ పిలుపుకు మద్దతు ఇవ్వాలన్నారు.విద్యుత్ వినియోగదారులు వారి చార్జీలు ఆన్‌లైన్‌లో పేచేయాలన్నారు. విద్యుత్ ఉద్యోగులు నిరంతరం కష్టపడి పని చేస్తున్నారు ప్రజలు కూడా సహకరించి ఇండ్లలోనే ఉండాలన్నారు.