సంజయ్ దత్‌కు లంగ్ క్యాన్సర్‌!

163
sanjay dutt
- Advertisement -

అనారోగ్యం కారణంగా ఇటీవలె బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. శ్వాస సంబంధిత సమస్యలు,ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరిన సంజయ్‌…మూడు రోజుల చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు.

అయితే డిశ్చార్జ్ అయ్యాక షాకింగ్ విషయం వెలుగుచూసింది. సంజయ్‌ ప్రమాదకరమైన లంగ్ క్యాన్సర్ అదికూడా స్టేజ్-3 ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారని టెస్టుల్లో తెలింది. మద్యం, సిగరెట్లు, డ్రగ్స్‌ ఇవన్నీ సంజయ్‌కి క్యాన్సర్ రావడానికి కారణం కావొచ్చని డాక్టర్లు భావిస్తున్నారు.

ఇటీవలె సంజయ్‌కి కరోనా టెస్టులు నిర్వహించగా కరోనా నెగటివ్‌గా తేలింది. ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయిన అనంతరం తాను ఆరోగ్యంగా ఉన్నానని ఏ ఆందోళన అవసరం లేదని సంజయ్ చెప్పిన కొద్దిగంటల్లోనే ఆయనకు క్యాన్సర్‌ అని తేలడంతో అంతా షాక్‌కు గురయ్యారు.

- Advertisement -