చేనేత రంగానికి పూర్వ వైభవం తేవడమే రాష్ట్ర ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కృషిచేస్తున్నారు.చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించడానికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్న కేటీఆర్….ప్రజలందరూ చేనేత వస్త్రాలు ధరించేలా చేనేత లక్ష్మి కార్యక్రమాన్ని సైతం తీసుకొచ్చారు. కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా తానే నేతన్నకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారి ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరిస్తానని ప్రకటించి…స్పూర్తిగా నిలిచారు. కేటీఆర్ స్పూర్తితో మొదలైన ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగుతోంది. సినీ నటుల దగ్గరి నుంచి ప్రజా ప్రతినిధుల వరకు అందరు చేనేతకు చేయూత నందించేందుకు ముందుకొస్తున్నారు.
ఈ కార్యక్రమానికి సంపూర్ణ మద్దుతు తెలిపిన సమంత.. సాద్యమైనన్ని ఎక్కువ సందర్భాల్లో చేనేత వస్తాలను ధరించారు. చేనేతల ప్రోత్సాహించేందుకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు అంగీకరించారు. ఇక అక్కినేని నాగార్జున దంపతులు నేత వస్త్రాలు ధరించారు. తాజాగా ఈ లిస్ట్‌లో టెన్నిస్ సానియా మీర్జా కూడా చేరిపోయింది. నేడు సోమవారం హ్యండ్లూమ్ అయినందునా చేనేత వస్త్రాలు ధరించి ట్విట్టర్లో ఫోటోలు షేర్ చేసింది సానియా.
It's Monday!!! #wearhandloom #happyday ☺️ @KTRTRS pic.twitter.com/mOwkTshFI4
— Sania Mirza (@MirzaSania) May 1, 2017
తాను చేనేత వస్త్రాలు ధరిస్తున్నానని, మరి మీ మాటేమిటని.. సినీ ప్రముఖులకు సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ సూచించిన సంగతి తెలిసిందే. విలక్షన నటుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ మహేష్ బాబు, టెన్నిస్ తార సానియా మీర్జా, రాజ్‌దీప్ సర్దేశాయ్, వివేక్ ఒబెరాయ్, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మీ, పీవీ సింధు, నటి సమంత తదితరులను ఆహ్వానించాగా అందరు పాజిటివ్‌గా స్పందించారు.