- Advertisement -
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇటీవలె తన భర్త షోయబ్ మాలిక్‌తో విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న సానియా… తాజాగా తన ఇంటి నేమ్ ప్లేట్‌ను మార్చేసింది.
తన పేరు పక్కన కుమారుడు ఇజాన్ పేరు ఉండేలా సానియా ఇజాన్ నేమ్ ప్లేట్‌ను ఇంటి ముందు తగిలించేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోను సానియా తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది.
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను సానియా మీర్జా ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం 2010లో హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. 2018లో ఈ దంపతులకు ఓ కుమారుడు ఇజాన్ జన్మించాడు. తర్వాత సానియాతో విడిపోగా షోయబ్ ముచ్చటగా మూడో పెళ్లి కూడా చేసుకున్నాడు. పాకిస్థాన్ నటి సనా జావెద్‌ను పెళ్లిచేసుకున్నారు.
Also Read:మెంతులతో ఆరోగ్య ప్రయోజనాలు!
- Advertisement -