సానియా దంపతులకు గోల్డెన్ వీసా..

175
sania
- Advertisement -

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా – దంపతులకు గోల్డెన్ వీసా జారీ చేసింది యూఈఏ. 2019లో యూఏఈ సర్కార్ గోల్డెన్ వీసా ప్రవేశ పెట్టగా దీని కాలపరిమితి పదేళ్లు.సానియా-షోయెబ్‌లు 2010లో పెళ్లి చేసుకున్నారు. అయితే చాన్నాళ్ల నుంచి దుబాయ్‌లోనే ఉంటున్నారు.

దీర్ఘ‌కాలం తమ దేశంలో ఉన్నవారికి, వ్యాపార‌వేత్త‌లు, ప్రొఫెష‌న‌ల్స్‌, సైన్సు లాంటి అంశాల్లో ప్ర‌త్యేక ట్యాలెంట్ ఉన్న‌వారికి ఈ వీసా ఇవ్వ‌నున్నారు. ఈ వీసా ఉన్న విదేశీయులు.. యూఏఈలోనే ప‌నిచేసుకునే వీలు ఉంటుంది. ప‌దేళ్ల కాల వ్య‌వ‌ధి త‌ర్వాత ఆటోమెటిక్‌గా గోల్డెన్ వీసాను రెన్యూవ‌ల్ చేస్తారు.

గ‌తంలో గోల్డెన్ వీసా ద‌క్కించుకున్న క్రీడాకారుల్లో క్రిస్టియానో రోనాల్డో, లూయిస్ ఫిగో, నోవాక్ జోకోవిచ్‌లు ఉన్నారు. షారూక్ ఖాన్‌, సంజ‌య్ ద‌త్‌ల‌కు కూడా ఈ వీసాలు ఉన్నాయి.

- Advertisement -