శృతిని మేమే తప్పించాం..

233
- Advertisement -

బాహుబ‌లి2 పోటీగా సంఘ‌మిత్ర చిత్రం తెర‌కెక్క‌నుంద‌నే విష‌యం తెలిసిందే. దాదాపు 450 కోట్ల బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించాల‌ని సుంద‌ర్ సి భావించాడు. ఆర్య‌, జ‌యం ర‌వి, శృతి హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొంద‌నున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్స్ రీసెంట్ గా కేన్స్ లో విడుద‌ల చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాలో శృతి యువరాణిగా నటించనుండగా..అయితే శృతి సంఘమిత్ర నుండి తప్పుకున్న విషయం తెలిసిందే.. ఈ అమ్మడు సినిమా కోసం విదేశాల్లో ప్రత్యేకంగా యుద్ధ విద్యల్లో శిక్షణ కూడా తీసుకుంది. ఆ క‌స‌ర‌త్తులకి సంబంధించిన వీడియోల‌ని కూడా సోష‌ల్ మీడియాలో కూడా షేర్ చేసుకుంది. ఇదంతా జరిగాక ఉన్నట్టుండి ఈ సినిమా నుంచి శృతి తప్పుకునట్లు ప్రకటన చేయడంతో అంతం షాక్‌ అయ్యారు .అయితే ఈ సినిమా పూర్తి కథ సిద్ధమవకపోవడం వల్లే శృతి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది.

Sanghamitra Movie Producers Says no to Shruti Haasan

మరి ఈ విషయంపై తాజగా అసలు సంగతి బయటకు వచ్చింది. నిజానికి ఈ సినిమా నుంచి శృతి తనంతట తానుగా తప్పుకోలేదట. సినిమా నిర్మాతలే ఆమెను తప్పించారట. ఆ విషయాలను వెల్లడించారు నిర్మాతల్లో ఒకరైన హేమరుక్మిణి. ఈ సినిమా కథ గురించి చెప్పగానే శృతి భారీ పారితోషికం డిమాండ్‌ చేసిందట. శృతి డిమాండ్‌ చేసినంత ఇవ్వడానికి అంగీకరించారట నిర్మాతలు. అంతేకాకుండా విదేశాల్లో శిక్షణ పేరుతో నిర్మాతల వద్ద నుంచి చాలా పెద్ద మొత్తం లాగేసిందట. పైగా, ఇతర విషయాల్లో కూడా శృతి ప్రవర్తన నిర్మాతలకు నచ్చలేదట. దీంతో శృతిని ఆ సినిమా నుంచి తప్పించారట. ‘‘సంఘమిత్ర’ చిత్రం నుంచి శృతి వైదొలగలేదు. ఆమెతో కలిసి పనిచేయలేని పరిస్థితుల్లో మేమే తొలగించాం’ అని వెల్లడించారు నిర్మాత. అయితే ఈ సంఘ‌మిత్ర చిత్రం వ‌చ్చే ఏడాది పట్టాల‌పైకి వెళ్ళ‌నుండ‌గా, ఈ మూవీకి ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందించ‌నున్నాడు.

- Advertisement -