రవితేజ సోదరుడి మృతి

214
Ravi Teja Brother Bharat Ded
- Advertisement -

ఔటర్ రింగురోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్‌ మండలం కొత్వాల్‌గూడ దగ్గర ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఆగివున్న లారీని కారు ఢీకొంది. దీంతో కారులో ఉన్న సినీ హీరో రవితేజ సోదరుడు భరత్‌ దుర్మరణం పాలయ్యాడు. కాగా… ఈ ప్రమాదాన్ని భరత్ స్నేహితులు గోప్యంగా ఉంచారు. ప్రమాదవార్త తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి రవితేజ సోదరుడు భరత్‌గా నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Ravi Teja Brother Bharat Ded

అయితే రోడ్డు మీద ఆపిన లారీని అక్రమంగా ఆపారని చెబుతున్నారు. ఎందుకంటే.. లారీ చెడిపోవటంతో రోడ్డు మీద ఆపేశారు.  కేవలం చెట్టు కొమ్మలు మాత్రమే ఉంచారు తప్పించి.. ఎలాంటి ఇండికేటర్లు ఏర్పాటు చేయలేదు. చీకటిలో ఎదురుగా ఉన్నది లారీ అన్నది గుర్తించటంలో జరిగిన పొరపాటు.. ప్రాణాలు పోయేంత పెను ప్రమాదంగా మారిందని చెబుతున్నారు.

- Advertisement -