గ్రీన్ ఛాలెంజ్‌.. మొక్కలు నాటిన సంగారెడ్డి డీఎస్పీ..

581
Sangareddy DSP
- Advertisement -

కేసీఆర్ హరితహారం స్పూర్తితో పార్లమెంట్ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతోంది. గ్రీన్ ఛాలెంజ్ భాగంగా ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్‌ఆర్‌ శర్మ విసిరిన గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్ రెడ్డి సదాశివపేట పోలిస్ స్టేషన్ ఆవరణలో మూడు మొక్కలు నాటడం జరిగింది. అనంతరం మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్‌ను విసిరారు. సంగారెడ్డి RDO శిబూసం,ఎంఆర్‌ఎఫ్‌ జనరల్‌ మేనేజర్‌,బొంగుల విజయలక్మి చైర్ పర్సన్ సంగారెడ్డి లను మొక్కలు నాటాలని ఆయన కోరారు.

green challenge

ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. సమజాహితం కోసం ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగస్వామిని కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం పచ్చగా వెల్లివిరియాలని అందరు ఈ కార్యక్రమాన్ని స్వీకరించి ముందుకు వెళ్లి ప్రకృతిని కాపాడాలని కోరారు. ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వామిని చేసిన ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్‌ఆర్‌ శర్మకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లో సదాశివపేట CI, కొండాపూర్ CIలతో పాటు పలువురు SIలు పాల్గొన్నారు.

- Advertisement -