ఈ నెల 12 నుండి సంగమేశ్వర ప్రాజెక్టు సర్వే నిర్వహించనున్నారు. సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాలకు నీరందించే సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సర్వే పనులను హరీశ్ రావు ప్రారంభించనున్నారు. ఈ మూడు నియోజకవర్గాలలో సుమారు 2.19 లక్షల ఎకరాలకు సాగు నీరందించనున్నారు.
సంగారెడ్డి నియోజకవర్గానికి ఈ ప్రాజెక్టు ద్వారా 57 వేల ఎకరాలకు, ఆందోల్ నియోజకవర్గంలో 56 వేల ఎకరాలు, జహీరాబాద్ నియోజకవర్గంలో సుమారు లక్షా ఆరు వేల ఎకరాలకు సాగు నీరందనుంది. ఈ ప్రాజెక్టులో రెండు పంప్‌హౌస్‌లను నిర్మించనుండగా మొదటి పంపు ద్వారా ఐదులాపూర్ నుండి వెంకటాపూర్ డెలివరీ సిస్టం వరకు సుమారు 125 మీటర్ల ఎత్తు వరకు నీటిని ఎత్తిపోయనున్నారు. ఈ డెలివరీ సిస్టం నుండి జహీరాబాద్,హద్నూర్, కంది కెనాల్స్ ద్వారా దాదాపు 2.19 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుంది.
రెండో లిఫ్ట్ ద్వారా జహీరాబాద్ కెనాల్‌పై హతికుర్దు నుంచి గోవిందాపూర్ వరకు సుమారు 40 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసి 42 వేల ఎకరాలకు నీరందించనున్నారు. ఈ రెండో లిఫ్ట్ ద్వారా మొగుడంపల్లి, జహీరాబాద్ మండలాలకు నీరు అందనుంది.