ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌…కొత్త ధరలు ఇవే..

31
covid

ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ పంపిణీ చేయడానికి కొత్త ధరలను నిర్ణయించింది కేంద్రం. కోవిషీల్డ్ ధర రూ.780 కాగా, కోవాగ్జిన్‌ ధర రూ. 1,410గా ఉంటుందని ప్రకటించిన కేంద్రం.. ఇక, స్పుత్నిక్ -వి ధరను రూ.1,145గా పేర్కొంది. వీటికి పన్నులు అదనం కాగా ప్రైవేట్ ఆస్పత్రుల రూ.150 సర్వీసు ఛార్జీ కూడా ఉండనుంది.

ఇక ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకా పూర్తిగా ఉచితంగా ఇవ్వనున్నారు. వ్యాక్సిన్లను కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేస్తోందని.. 75 శాతం వ్యాక్సిన్లు అన్ని రాష్ట్రాలకు సరఫరా చేస్తామని.. మిగతా 25 శాతం వ్యాక్సిన్లు ప్రైవేట్ ఆస్పత్రులకు ఇవ్వనున్నట్టు కేంద్రం తెలిపింది.