మూవీ రివ్యూ..సందేహం

212
- Advertisement -

క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో సతీష్ పరమవేద తెరకెక్కించిన చిత్రం సందేహం. సుమన్ తేజ్, హెబ్బా పటేల్ ప్రధానపాత్రల్లో విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్‌పై సత్యానారాయణ పర్చా నిర్మించారు. ప్రమోషనల్ కార్యక్రమాలతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోగా శ్వేతా వర్మ, రాశిక శెట్టి, శుభ శ్రీ రాయగురు, శ్రీనివాస్ భోగిరెడ్డి, సుందర్ రావు పర్చా తదితరులు కీలకపాత్ర పోషించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ:

ఇదో ట్రయాంగిల్ లవ్‌స్టోరి. హ‌ర్ష‌ (సుమ‌న్ తేజ్‌)ను ప్రాణంగా ప్రేమిస్తుంది శృతి (హెబ్బాప‌టేల్‌). వీరి ప్రేమ పెళ్లికి పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరూ ఒకటవుతారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ శృతి ప్రవర్తనలో మార్పు వస్తుంది. సీన్ కట్ చేస్తే వీరిద్ద‌రి లైఫ్‌లోకి ఆర్య (సుమ‌న్ తేజ్‌) వ‌స్తాడు. శృతికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలో కరోనాతో హర్ష చనిపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది?,ఆర్య,హర్ష ఇద్దరు ఒకే పోలికలతో ఎందుకుంటారు?,నిజంగానే శృతికి బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా అన్నదే సినిమా కథ.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కథ,నటీనటులు. చనిపోయిన ఓ వ్యక్తి తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అన్నదే సినిమా కథ. ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీకి క్రైమ్ థ్రిల్ల‌ర్ అంశాల‌ను జోడించి దర్శకుడు తెరకెక్కించిన విధానం బాగుంఉది. ముఖ్యంగా హీరో ద్విపాత్రాభినయం, హర్ష,ఆర్యలలో చనిపోయింది ఎవరు అనేది చివరి వరకు సస్పెన్స్‌లో ఉంచడం సినిమాకే హైలైట్. రొమాంటిక్ కామెడీ, క్రైమ్ థ్రిల్ల‌ర్‌ను బ్యాలెన్స్ చేశారు దర్శకుడు. సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు ,ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ సూపర్బ్.

హర్ష , ఆర్య పాత్రల్లో ఒదిగిపోయాడు సుమన్ తేజ్. ఇక హెబ్బా పటేల్ గ్లామర్ సినిమాకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. తనదైన నటనతో ఆకట్టుకోగా మిగితా నటీనటులు తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.

Also Read:నేరేడుపండుతో షుగర్ సమస్యలకుచెక్!

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా బాగుంది. తాను ఎంచుకున్న పాయింట్‌ను చెప్పడంలో సక్సెస్ అయ్యారు. సినిమాటోగ్రఫీ, పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. దర్శకుడు సతీష్ పరమవేద గ్రిప్పింగ్ నేరేషన్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

ఫ్రెష్ ఐడియా, కొత్త కాన్సెప్ట్‌తో దర్శకుడు సతీష్ చేసిన ప్రయత్నం బాగుంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ జాన‌ర్ మూవీస్‌ను ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకునే చిత్రం సందేహం.

రేటింగ్ : 3 /5

- Advertisement -