అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు దర్శకుడు సందీప్ వంగా. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ సినిమానే హిందీలో షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి సంచలనం సృష్టించాడు.
తాజాగా మరోసారి బాలీవుడ్లోనే మరో క్రేజీ సినిమాకు ఓకే చెప్పాడు. కబీర్ సింగ్ నిర్మాతలు భూషణ్ కుమార్ – మూరధ్ ఖేతనితో క్రైమ్ డ్రామాని తెరకెక్కించనున్నాడు సందీప్. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన టైటిల్‌తో పాటు సినిమాలో నటీనటుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
కబీర్ సింగ్ సినిమాతో ఊహించని విధంగా మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి నిర్మాతలకు మంచి లబాల్ని అందించాడు సందీప్. దీంతో మళ్ళీ సందీప్‌తోనే సినిమా చేసేందుకు సిద్దమయ్యారు. మరి ఈ మూవీతో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సందీప్ వంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో వేచి చూడాలి.