అయుష్మన్ కంటే ఆరోగ్య శ్రీ భేష్‌- మంత్రి ఈటెల

465
minister etela
- Advertisement -

ఢిల్లీలో రెండు రోజుల పాటు జరుగుతున్న సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హాజరైయ్యారు. ఈ సమావేశానికి కో చైర్మన్‌గా మంత్రి ఈటల ఎంపికైయ్యారు. అలాగే చైర్మన్‌గా కేంద్ర మంత్రి హర్ష వర్ధన్, వైస్ చైర్మన్‌గా కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ ఎంపిక అయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి రాష్ట్ర వాదనను గట్టిగా వినిపించారు.. తెలంగాణ లాంటి ప్రోగ్రెసివ్ స్టేట్స్‌కి ఎక్కువ మద్దతు అందించాలని కోరారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద సిబ్బందికి కూడా నిధులు పెంచాలని.. NHM కింద రాష్ట్రంలో పనిచేస్తున్న వారందరికీ జీత భత్యాలు అందించాలని మంత్రి ఈటల కోరారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అయుష్మన్ భారత్ యోజన పథకం కంటే తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య శ్రీ పథకం చాలా మెరుగైనది అని ఢిల్లీ వేదికగా మరోసారి తేల్చి చెప్పారు.. ఆయుష్మాన్ భారత్ పథకం వల్ల తెలంగాణ రాష్ట్రంలో కేవలం 24 లక్షల మందికి మాత్రమే లబ్ధి చేకూరుతుందని, అదే ఆరోగ్య శ్రీ వల్ల 85 లక్షల మందికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు.

ఆయుష్మాన్ భారత్ ద్వారా అందించే చికిత్సల్లో అత్యధికంగా ఐదు లక్షలు మాత్రమే రోగులకు ఇస్తున్నారని.. తెలంగాణలో ఉన్న ఆరోగ్య శ్రీతో మూత్రపిండాలు,గుండె కూడా మార్పిడి చేస్తున్నామని దీనికి 13 లక్షల రూపాయలు ప్రభుత్వం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్యానికి మాత్రమే సాయం అందిస్తుంది అలాకాకుండా సెకండరీ, టర్షరీ స్థాయిలో ఉన్న ఆసుపత్రులకు కూడా అవసరమైన నిధులు అందించాలని సమావేశంలో మంత్రి కోరారు.

ఈ సమావేశం రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య సమన్వయాన్ని పెంచాలని సాధ్యమైనన్ని ఎక్కువ నిధులు నేరుగా రాష్ట్రాలకు అందించేవిధంగా నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

- Advertisement -