సర్కార్ వారి పాట తర్వాత వరుస సినిమాలకు కమిట్ అయ్యారు మహేష్ బాబు. ఇందులో భాగంగా సందీప్ వంగతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు దర్శకుడు సందీప్ వంగా. అర్జున్ రెడ్డితో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్…తర్వాత ఇదే మూవీని బాలీవుడ్‌లో రీమేక్ చేసి సక్సెస్ సాధించారు.
ఈ మూవీ తర్వాత సందీప్ సినిమా ఎవరితో ఉండబోతుందోననే ఆసక్తి అందరిలో నెలకొంది. చాలామంది హీరోల పేర్లు తెరపైకి వచ్చిన సందీప్ మాత్రం మహేష్‌తో మూవీ కోసం కథ సిద్ధం చేసి చాలారోజులుగా వెయిట్ చేస్తున్నారు. తాజాగా మహేష్ డేట్స్ ఫిక్స్ కావడంతో సినిమాపై క్రేజీ అప్‌డేట్ ఇచ్చేశారు.
ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎనిమి అనే సినిమా చేస్తున్నాడు సందీప్. ఇక మహేష్ తెలుగులో ‘సర్కారు వారి పాట చేస్తుండగా’, నెక్స్ట్ మూవీని త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నారు. వీటి తర్వాత సందీప్ – మహేష్ కాంబోలో మూవీ మొదలయ్యే అవకాశాలున్నాయి.