మాస్ మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘క్రాక్’. ఈ సినిమా నిర్మాణ పనులు ముగింపు దశలో ఉన్నాయి. చివరి షెడ్యూల్ మినహా మిగతా షూటింగ్ అంతా పూర్తవగా, లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత ఆ షెడ్యూల్ జరగనున్నది. ఏప్రిల్ 26 తమిళ నటుడు సముద్రకని పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘క్రాక్’ చిత్రంలో ఆయన పోషిస్తోన్న క్యారెక్టర్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
పోస్టర్‌లో చూపించిన విధంగా కటారి అనే పవర్‌ఫుల్ రోల్‌లో ఇంటెన్స్ లుక్‌లో సముద్రకని కనిపించనున్నారు. ఈ సినిమాతో శ్రుతి హాసన్ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ ఒక నెగటివ్ రోల్‌లో కనిపించనున్నారు. సరస్వతీ ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా జి.కె. విష్ణు పనిచేస్తున్నారు. తారాగణం:రవితేజ, శ్రుతి హాసన్, సముద్రకని, వరలక్ష్మీ శరత్‌కుమార్, రవిశంకర్, దేవీ ప్రసాద్, చిరగ్ జాని, మౌర్యని, ‘హ్యపీ డేస్’ సుధాకర్, వంశీ చాగంటి తదితరులు.