Kaantha:సముద్రఖని..ఫస్ట్ లుక్

19
- Advertisement -

దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం “కాంతా”. ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా మరియు దుల్కర్ సల్మాన్ వేఫేర్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇవాళ సముద్ర ఖని బర్త్ డే సందర్భంగా సినిమా నుండి ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. సముద్రఖని లుక్ అందరిని ఆకట్టుకుంటోంది. ఫార్మల్ డ్రెస్‌లో, గళ్లద్దాల వెనుక నుంచి ఉన్న లుక్ అందరిని ఇంప్రెస్ చేసింది.

“కాంతా” చిత్రబృందం ఇప్పటికే దుల్కర్ మరియు కథానాయిక భాగ్యశ్రీ బోర్స్ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. విడుదల తేదీ త్వరలోనే ప్రకటించనున్నారు.

Also Read:శర్వా సినిమాలో అనుపమ!

- Advertisement -