సముద్రఖని దర్శకత్వంలో రామ్ చరణ్‌..?

77
ram charan
- Advertisement -

ఓ వైపు సినిమాలు మరోవైపు కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉన్నారు రామ్ చరణ్. ప్రస్తుం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ నెల 25న సినిమా విడుదల కానుండగా తన తర్వాతి ప్రాజెక్టులపై దృష్టిసారించారు చరణ్.

15వ సినిమాను శంకర్ దర్శకత్వంలో చేస్తుండగా మరోరెండు సినిమాలను లైన్లో పెట్టేశారు. ఇందులో ఒకటి గౌతమ్ తిన్ననూరి సినిమా కాగా మరోకటి సముద్రఖనితో చేయనున్నారు. సముద్రఖని చెప్పిన కథ నచ్చడంతో చరణ్ గ్రీన్ సిగ్నల్ఇచ్చినట్లు తెలుస్తోంది.

త్వరలోనే వీరిద్దరి కాంబోలో మూవీపై స్పష్టత రానుండగా చరణ్…మెగాస్టార్‌తో ఆచార్య సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -