గని…ట్రైలర్‌తో రిలీజ్ డేట్ లాక్‌!

90
ghani
- Advertisement -

టాలీవుడ్‌ మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌ ప్రస్తుతం ‘గని’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు బాబీ కంపెనీ, రినైసెన్స్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమా దాదాపు రూ.35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది.

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్,అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. సినిమా ట్రైలర్‌తో పాటు రిలీజ్ డేట్‌ని అనౌన్స్‌చేసింది చిత్రయూనిట్. ఏప్రిల్ 8న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు. గెల‌వ‌డం త‌ప్ప ఆప్ష‌న్ లేదు అంటూ వరుణ్ తేజ్‌ పంచ్‌లు అందరిని ఆకట్టుకున్నాయి.

- Advertisement -