వైరస్ ఫస్ట్ లుక్ రిలీజ్….

244

తక్కువ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు మూవీ ‘‘వైరస్’’ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది. టైటిల్స్ తోనే తన సినిమా కి హైప్స్ ని క్రియేట్ చేయడం తెలిసిన బర్నింగ్ స్టార్ ఈ సారి కూడా టైటిల్ తోనే ఎట్రాక్ట్ చేసాడు. వైరస్ మూవీ కి నోవాక్సిక్ ఓన్లీ టాక్సిన్ అనేది ఉపశీర్షిక. పల్లెరేవు రామచంద్రారెడ్డి సమర్పణలో ఎయస్ఎన్ ఫిల్మ్స్ అండ్ జస్ట్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ఎమ్ డి సలీమ్, శ్రీనివస్ మంగాల నిర్మించిన ఈ మూవీ కి దర్శకుడు యస్.ఆర్ క్రిష్ణ.

Sampoornesh Babu VIRUS First Look Poster

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ… వైరస్ ఫస్ట్ లుక్ ని లాంఛ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా అనుకున్న టైం లో కంప్లీట్ చేసేందుకు సహాకరించిన యూనిట్ మెంబర్స్ కి థ్యాంక్స్. అలాగే సంపూర్ణేష్ బాబు తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. వైరస్ చిత్రం టెర్రిఫిక్ హార్రర్ కామెడీ తో పాటు మర్డర్ మిస్టరీ తో సాగే కథనం.. ఈ సినిమా యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తుందని అన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్న వైరస్ రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటించనుంది చిత్ర యూనిట్. సంపూర్ణష్ బాబు తనదైనశైలిలో సమాజంలోని విలువలను ప్రశ్నించబోతున్నాడు. ఇప్పటికే హృదయకాలేయం, సింగం 123 సినిమాలతో తనకంటూ ప్రత్యేక మైన గుర్తింపు పొందిన ఈ బర్నింగ్ స్టార్ మరోసారి ఒక డిఫరెంట్ కామెడీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.