‘సమ్మతమే’ విడుదల ముహుర్తం ఖరారు..

271
Sammathame
- Advertisement -

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం “సమ్మతమే” చిత్రం జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతుండగా, రేపు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్‌ను సొంతం చేసుకోవడంతో ‘సమ్మతమే’ సేఫ్ హాండ్స్‌లోకి వెళ్ళింది. సినిమా అన్ని ప్రాంతాలలో గ్రాండ్ రిలీజ్ కానుంది.

గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చాందిని చౌదరి కథానాయికగా నటిస్తోంది. విడుదలకు ముందే ‘సమ్మతమే’ పాజిటివ్ రిపోర్ట్స్ సొంతం చేసుకుంటుంది. టీజర్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా పాటలకు కూడా మంచి ఆదరణ లభించింది. గోపీనాథ్ రెడ్డి ఓ డిఫరెంట్ లవ్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ అందించగా, శేఖర్ చంద్ర సంగీతం అందించారు. యుజి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తారాగణం: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి తదితరులు.
టెక్నికల్ టీమ్ :
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపీనాథ్ రెడ్డి
నిర్మాత: కంకణాల ప్రవీణ
బ్యానర్: యూజీ ప్రొడక్షన్స్
సంగీతం: శేఖర్ చంద్ర
డీవోపీ: సతీష్ రెడ్డి మాసం
ఎడిటర్: విల్పవ్ నైషదం
ఆర్ట్ డైరెక్టర్: సుధీర్ మాచర్ల
పీఆర్వో: వంశీ-శేఖర్

- Advertisement -