వాంఖడేలో రికార్డు సృష్టించిన కోహ్లి

263
Kohli scores 15th Test hundred in milestone filled inning
- Advertisement -

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సెంచరీ సాధించిన కోహ్లి…ఒకే సిరీస్‌లో ఐదు వందలకు పైగా పరుగులు సాధించిన రెండో భారత కెప్టెన్‌గా నిలిచాడు. ఇప్పటివరకూ ఈ ఫీట్ను గవాస్కర్ మాత్రమే రెండుసార్లు సాధించాడు. 1978-79 సీజన్లో వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో గవాస్కర్ ఐదు వందలకు పైగా పరుగులు చేయగా,1981-82 సీజన్లో ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లో గవాస్కర్ ఐదు వందల పరుగుల మార్కును రెండోసారి సాధించాడు.

Kohli scores 15th Test hundred in milestone filled inning

అంతేగాదు టెస్టుల్లో నాలుగు వేల పరుగుల మైలు రాయితో పాటు, సెంచరీల్లోను రికార్డులకెక్కాడు. టెస్టులు(15), వన్డేలు(26), టీ20లు(4) కలిపి 45 సెంచరీలు చేశాడు కోహ్లీ. ఇక ఒక సీజన్‌లో కెప్టెన్‌గా 1000 పరుగులు సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 1997లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెండూల్కర్‌… 2006లో రాహుల్‌ ద్రవిడ్‌ మాత్రమే ఈ ఘనత అందుకున్నారు. ఈ సిరీస్లో 500 పరుగులను సాధించే క్రమంలో విరాట్ యావరేజ్ 120.0కు పైగా ఉండటం మరో విశేషం.

Kohli scores 15th Test hundred in milestone filled inning

820 పరుగులతో కోహ్లీ తర్వాత భారత్ తరుపున టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఛటేశ్వర్ పుజారా నిలిచాడు. ఈ ఏడాది టెస్టుల్లో 1000 పరుగులకు పైగా సాధించిన ఆటగాళ్లలో బెయిర్ స్టో (1,369), జో రూట్ (1,306), అలెస్టర్ కుక్ (1,193)లు ఉన్నారు.

- Advertisement -