చిరు మానియా… బుకింగ్స్‌లో రప్ఫాడిస్తున్న ఖైదీ

65
Megastar Chiranjeevi is back with a bang. Advance bookings of the film were open for a couple of theaters in India and abroad. And the response is terrific

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేషన్ ఖైదీ నెంబర్ 150. దాదాపు 9 సంవత్సరాల తర్వాత తిరిగి సిల్వర్‌ స్క్రీన్‌ పై నటిస్తున్న చిరంజీవి…ఖైదీపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. సినిమా పాటల దగ్గరి నుంచి ట్రైలర్ వరకు చిరు మానియాతో ఖైదీ టాలీవుడ్ రికార్డులను తిరగరాస్తోంది. ఇక బుకింగ్స్‌ విషయంలోనూ ఆడియన్స్‌ ఎక్కడా తగ్గడం లేదు. ఖైదీ బుకింగ్స్‌ చూసి…ట్రేడ్ వర్గాలకే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది.

అలా ఆన్ లైన్ లో టికెట్స్ పెట్టడం ఆలస్యం.. ఇలా హౌస్ ఫుల్స్ పడిపోతున్నాయి. సింగిల్ స్క్రీన్ లతో పాటు మల్టీప్లెక్సుల్లో కూడా జోరు చాలా ఎక్కువగా ఉంది. పరిస్థితి చూస్తుంటే.. జనవరి 11న రాష్ట్రం మొత్తం అన్ని థియేటర్లలోనూ ఖైదీ నంబర్ 150ని ప్రదర్శించినా సరే టికెట్స్ ఇప్పుడే సేల్ అయిపోయేట్లుగా ఉంది.

ఇక ప్రసాద్ ల్యాబ్స్‌లో 33.. ఇనార్బిట్ లో 23.. ఫోరం మాల్ లో 34.. పీవీఆర్ లో 13.. మంజీరా మాల్ లో 17.. అత్తాపూర్ 19.. అన్నీ చిరంజీవి మూవీనే వేస్తున్నారు. అన్నింటికీ టికెట్స్ అయిపోయాయి కూడా. మొదటి రోజే కాదు.. దాదాపు వీకెండ్ వరకూ ప్రైమ్ టైమ్ షోస్ కి టికెట్స్ దొరకని పరిస్థితి నెలకొంది.

ఓవర్సీస్‌ లోనూ చిరు క్రేజ్‌ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే గల్ఫ్‌లో పలు కంపెనీలు ఖైదీ నెంబర్ 150 విడుదల సందర్భంగా హాలీడే ప్రకటించగా….బుకింగ్స్‌లోనూ చిరు మార్క్ ట్రెండ్ రిపీటవుతోంది. బుకింగ్స్ ఓపెన్ చేసిన గంటలోపే టికెట్లన్ని అమ్ముడయిపోయాయి. ఇక 12న శాతకర్ణి.. 14న శతమానం భవతి రిలీజ్ అవుతుండడంతో.. ఆయా థియేటర్లలో కూడా 11న ఖైదీనే ప్రదర్శిస్తున్నారు.