BRSలోకి మాజీ మంత్రి చంద్రశేఖర్

57
- Advertisement -

తెలంగాణ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌లోకి వలసలు జోరందుకున్నాయి. తాజాగా మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేశారు సంభాని. ఇవాళ ఎంపీ నామా నాగేశ్వరరావు, వృద్ధిరాజు రవిచంద్ర సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

తన 50 ఏళ్ల కాంగ్రెస్ జీవితానికి కాంగ్రెస్ పార్టీలో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఖమ్మం జిల్లాతో పాటు సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గెలుపునకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లాలో సంభానికి మంచి పట్టు ఉంది. పలు నియోజకవర్గాల్లో ఆయన అభిమానులు ఉన్నారు. ఎన్నికల వేళ ఆయన కాంగ్రెస్‌కు వీడటం ఆ పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పవచ్చు.

Also Read:‘రాజమౌళి’ని వదిలేసి రిస్క్ చేశాడా?

- Advertisement -