సాయి దుర్గతేజ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా సంబరాలఏటిగట్టు (SYG). తేజ్ కెరీర్ లో అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌గా దాదాపు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. నిరంజన్ రెడ్డి -చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజాగా విడుదలైన ‘కార్నేజ్’ టీజర్ సినిమాని రాయలసీమ ప్రాంతంలో చోటుచేసుకుంటుందని సంకేతం ఇచ్చింది. SYG ఒక మహానాయకుని కథగా, ఇది భారతదేశ స్వాతంత్ర్య సమర సమయంలో జరిగిన వీరుడి పోరాటం నేపథ్యంలో తెరకెక్కినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా రాయలసీమ వెనుకబాటు తనాన్ని, బ్రిటీష్ అధికారానికి వ్యతిరేకంగా పోరాడే ఓ ధైర్యవంతుడైన యువకుడి వీరత్వాన్ని చూపించనుందని తెలుస్తోంది. నటి ఐశ్వర్య లాక్ష్మీ కూడా ప్రధాన పాత్రలో నటిస్తుండగా ఈ సినిమాను డెబ్యుటెంట్ రోహిత్ KP దర్శకత్వం వహిస్తున్నారు.సంగీతం అజనీష్ లోక్నాథ్ అందిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్‌మెంట్ సంస్థ నిర్మించిన ఈ సినిమా 2025 సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది.
Also Read:ఏఆర్ రెహమాన్‌కు అస్వస్థత..