సమత కేసు: నిందితులకు ఉరి శిక్ష ఖరారు

436
samatha case
- Advertisement -

సమత కేసులో ఆదిలాబాద్ న్యాయస్ధానం సంచలన తీర్పు వెలువరించింది.  ముగ్గురిని దోషులుగా నిర్దారించిన న్యాయస్ధానం  ఉరి శిక్ష ఖరారు చేసింది. తీర్పు నేపథ్యంలో ప్రత్యేక న్యాయస్థానం వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమత కుటుంబీకులతో పాటు, గ్రామస్థులు పెద్ద ఎత్తున కోర్టుకు చేరుకున్నారు.

కుమ్రం భీం జిల్లా లింగాపూర్‌ అటవీ ప్రాంతంలోని ఎల్లపటార్‌లో నవంబర్‌ 24న ముగ్గురు నిందితులు షేక్‌ బాబా, షేక్‌ షాబుద్దీన్, షేక్‌ మగ్దూమ్‌లు సమతను అత్యాచారం చేసి హత్య చేశారు.

ఈ కేసు విచారణకు డిసెంబర్ 11న ఆదిలాబాద్‌లో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. ఈ కేసులో బాధితురాలి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు, పోలీసు, రెవెన్యూ అధికారులు, ఫోరెన్సిక్ వైద్యులు మొత్తం 25 మంది సాక్షులను కోర్టు విచారణ జరిపింది. డిసెంబర్ 31న కోర్టు విచారణ పూర్తి చేసింది. ఈ నెల 20తో ప్రాసిక్యూషన్, డిఫెన్స్ లాయర్ల మధ్య వాదనలు ముగిశాయి.

- Advertisement -