‘పుష్ప’.. సమంత ఐటెమ్‌ సాంగ్‌ వచ్చేసింది..

198
- Advertisement -

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్‌ ‘పుష్ప’. రష్మిక కథానాయిక. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ‘పుష్ప ది రైజ్‌’ డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇందులో సమంత ఐటమ్‌ సాంగ్‌తో అలరించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుండి సమంత నర్తించిన ఐటెమ్‌ సాంగ్‌ ‘ఊ అంటావా మామ.. ఊఊ.. అంటావా మామ ’ అనే ప్రత్యేక గీతం లిరికల్‌ వీడియో విడుదలైంది.

గేయ రచయిత చంద్రబోస్‌ రచించిన ఈ పాటలో సమంత హాట్‌ హాట్‌గా కనిపించనుంది. సమాజంలోని ఓ అంశాన్ని కథగా మలిచి రాసిన ఈ పాట సాహిత్యం కూడా ఆకట్టుకునే విధంగా వుంది. అమ్మాయిల విషయంలో మగాళ్ల వంకర బుద్ది గురించి కొనసాగే ఈ పాటలో సమంత అందం, అభినయం, నాట్యకౌశలం చక్కగా కుదిరాయి. ఈ ప్రత్యేక గీతం శ్రోతల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుందని చిత్ర యూనిట్‌ చెబుతుంది. ఈ పాటను సోదరి ఇంద్రవత్‌ చౌహాన్‌ ఆలపించింది. ఈ పాట పుష్ప చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

- Advertisement -