ప్రెగ్నెంట్‌ ఫోటోతో సమంత ఆసక్తికర పోస్ట్‌.. వైరల్‌

37
Samantha

టాలీవుడ్ జంట నాగచైతన్య- సమంత విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే చైతూతో వైవాహిక బంధం ముగిసిందని ప్రకటించిన సమంత ఇన్ స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్టు ఆసక్తి కలిగిస్తోంది. సామ్‌ ఈ పోస్టులో ప్రెగ్నెంట్‌తో ఉన్న మహిళ ఫొటోను షేర్‌ చేస్తూ భావోద్వేగానికి లోనయింది.

సమంత పోస్ట్‌… ‘నేను బాధలో, విచారంలో ఉన్నప్పుడు మా అమ్మ నాతో చెప్పిన మాటలే గుర్తుకు వస్తాయి. చరిత్రలో చివరకు ప్రేమే గెలుస్తుందనేది నిజం. కొందరు ద్రోహులు, దుర్మార్గులు, హంతకుల, నియంతలు ఉంటారు.. వెన్నుపోటు పొడుస్తారు. ఏది కనబడకుండా కుట్ర చేయడంలో వాళ్లు నిపుణులు. కానీ చివరకు వారి పతనం తప్పదు. ఇది చరిత్ర చెబుతున్న నిజం. మా అమ్మ నాకు చెప్పిన నిజం’ అంటూ స్టోరీని ముగించింది.

ఇది చూసిన సామ్‌ అభిమానులంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సమంత అయిష్టంగానే విడాకులు తీసుకుంటుందని కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే ఈ పోస్ట్‌ ఆమె ఎవరిని ఉద్దేశిస్తూ చేసిందనేది మాత్రం స్పష్టం లేదు. అయితే విడాకుల ప్రకటన అనంతరం సమంత పోస్ట్‌ వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది.