‘జానకీదేవి’గా మారనున్న సమంత..

272
Samantha
- Advertisement -

కొత్త కథాంశంతో తమిళ నాట సంచలన విజయాన్ని అందుకున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ‘96’. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమా కోలీవుడ్‌లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే తెలుగులో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో సమంత, శర్వానంద్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఈ చిత్రానికి సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు.

Samantha

 

అయితే తెలుగు నేటివిటీకి తగినట్టుగా కథలో చిన్నచిన్న మార్పులు చేయించిన, టైటిల్ కూడా తెలుగులో ఉండాలని నిర్ణయించుకున్నారట దిల్ రాజు. ఆయన ఈ సినిమా కోసం ‘జాను’ మరియు ‘జాను అలియాస్ జానకి’ అనే రెండు పేర్లను పరిశీలించారు. కానీ ఆ టైటిల్స్‌ కాకుండా తాజాగా ‘జానకీదేవి’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించారట దిల్‌ రాజు. దాదాపు ఇదే టైటిల్‌ను కన్ఫాం చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. మార్చి 6న శర్వానంద్ పుట్టినరోజు కావడంతో.. ఆ రోజున టైటిల్ లోగోను రిలీజ్ చేయనున్నారని సమాచారం. ఏప్రిల్లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా పనులు జరుగుతున్నాయి.

ఇక ఈ సినిమా ప్రేమకథా చిత్రమైనా హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్ ఏమాత్రం వుండదట.. నటనకు ఫీలింగ్స్‌కి మాత్రమే ప్రాధాన్యతనిచ్చే సినిమా అని తెలుస్తోంది. అందుకే ఈ సినిమాలో సమంత నటించేందుకు ఒప్పుడు ఇచ్చిందని సమాచారం. ప్రస్తుతం సమంత భ‌ర్త నాగచైతన్యతో క‌లిసి ‘మజిలీ’ సినిమాలో న‌టిస్తుంది. ఈ సినిమాతో పాటే నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మిస్ గ్రానీ అనే కొరియన్ సినిమా తెలుగు రీమేక్‌లో న‌టించ‌బోతుంది‌. దీనికి బేబీ టైటిల్ అనుకుంటున్నారు. మొత్తానికి పెళ్లయ్యాక సమంత వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

- Advertisement -