తెలుగు హీరోయిన్లలో సమంత ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. తన మనసులో ఉన్నది మాట్లాడ్డానికి, తనకు నచ్చిన పని చేయడానికి ఎప్పుడూ వెనుకాడదు. హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన నాటి నుంచే `ప్రత్యూష ఫౌండేషన్` ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటోంది. ఇక, అక్కినేని నాగచైతన్యకు భార్యగా మారిన తర్వాత కూడా సినిమాలను వదలకుండా బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకుంటోంది.
తాజాగా సమంత సోషల్ మీడియాలో ఓ చిన్నపాటి సునామీనే సృష్టించింది. ‘యూటర్న్’ చిత్రం విడుదలై, మంచి టాక్‌ను తెచ్చుకున్న నేపథ్యంలో, విహారయాత్రకు వెళ్లిన ఆమె, అక్కడ తీయించుకున్న ఓ హాట్ ఫొటోను షేర్ చేసుకోగా, అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘మానసిక ప్రశాంతత’ అంటూ ఫొటోకు క్యాప్షన్ పెట్టింది. ఈ ఫొటో పోస్టు చేసిన తరువాత కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే 5 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. పెళ్లయిన తరువాత కూడా తన గ్లామర్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది సమంత.