ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన హీరోయిన్ సమంత..

132
- Advertisement -

సినీ నటులు ప్రతిష్టాత్మకంగా భావించే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ అవార్డులు జాబితా విడుదలైంది. 2021 సంవత్సరానికి గాను ఐఎఫ్ఎఫ్ఎం అవార్డులను ప్రకటించింది. ఇందులో సౌత్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ ఉత్తమ వెబ్ సిరీస్‌గా ఎంపికైంది. ఈ వెబ్ సిరీస్‌ ఉత్తమ నటీనటులుగా సమంత, మనోజ్ బాజ్ పాయ్ ఎంపికయ్యారు. వీరిద్దరూ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో నటించారు.

సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో ఓటీటీ వరల్డ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దర్శకద్వయం రాజ్ నిడిమోరు – కృష్ణ డీకే రూపొందించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలై విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. లైంగిక వివక్షకు గురైన రాజీ అలియాస్ రాజ్యలక్ష్మి అనే తమిళ ఈలం సోల్జర్ పాత్రలో సామ్ అద్భుతంగా నటించిన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. యాక్షన్ సీన్స్‌తో పాటుగా బోల్డ్ సన్నివేశాల్లో కూడా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో సమంతను ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు వరించింది.

ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ.. ఐఎఫ్ఎఫ్ఎం టీమ్ సమంతకు అభినందనలు తెలిపారు. దీనిపై స్పందించిన సామ్.. ఫ్యామిలీ మ్యాన్ సృష్టికర్తలు రాజ్ & డీకే లకు కృతజ్ఞతలు చెప్పింది. “ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇది నిజంగా ప్రత్యేకమైనది. నా మీద విశ్వాసం ఉంచి.. నాకు మద్దతుగా నిలిచిన రాజ్-డికె లకు కృతజ్ఞతలు” అని సామ్ ట్వీట్ చేశారు.

కాగా, 27 భాషలకు చెందిన 120కి పైగా చిత్రాలు అవార్డుల కోసం పోటీ పడ్డాయి. ఇందులో ఉత్తమ చిత్రంగా సూర్య నటించిన ‘సూరరై పొట్రు’ (ఆకాశం నీ హద్దురా) చిత్రం ఎంపికైంది. ఉత్తమ నటుడిగా సూర్య ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా విద్యా బాలన్ (షేర్నీ) ఎంపికయ్యారు.

- Advertisement -