సమంత వస్తుంది ఇక ‘ఖుషి’నే!

15
- Advertisement -

విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ ఖుషి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొంత షూట్ జరుపుకున్న ఈ సినిమా సమంత అనారోగ్యం కారణంగా నెక్స్ట్ షెడ్యుల్ వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం సమంత కోలుకొని, ముంబై లో ఓ సిరీస్ షూట్ లో పాల్గొంటుంది. ఈ షూటింగ్ కంప్లీట్ చేసి సామ్ విజయ్ సినిమాకు షిఫ్ట్ అవ్వనుంది.

ఖుషి షూట్ మార్చ్ 8 నుండి ప్రారంభం కాబోతుంది. ఈ షెడ్యుల్ లో సమంత జాయిన్ అవ్వబోతుంది. ముందుగా హైదరాబాద్ లో కొన్ని సీన్స్ తీయనున్నారు. సామ్ కోసం కొన్ని నెలల నుండి వెయిట్ చేస్తున్న విజయ్ ఇక తన పెయిర్ తో కలిసి షూట్ లో పాల్గొననున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిసున్న ఈ సినిమా ఈ ఏడాది లోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అని కుదిరితే ఈ సినిమాను జూన్ లో మన్ సూన్ స్పెషల్ గా థియేటర్స్ లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి…

కస్టడీ…రాజుగా అరవింద్‌ స్వామి

తలైవా…170 కి గ్రీన్ సిగ్నల్

మంచు మనోజ్ పెళ్ళికి జూ.ఎన్టీఆర్!

- Advertisement -