సమంత రూట్‌ మార్చిందా..?

189
- Advertisement -

వరుస సినిమాలతో బిజీగా ఉండే సమంత కాస్త ఇప్పుడు రూట్ మార్చింది. జనతా గ్యారేజ్ చిత్రం తర్వాత సమంత తాను లీడ్ రోల్ పోషించనున్న ఏ ఒక్క సినిమాకు కూడా గ్నీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు. అయితే ఆ మధ్య చెర్రీ- సుకుమార్ సినిమాలో సమంత లీడ్ రోల్ చేయనుందని వార్తలొచ్చాయి.

కాని కొన్ని కారణాల వలన ఈ అమ్మడు ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని టాక్. ఇక ప్రస్తుతం కొన్ని తమిళ సినిమాలతో పాటు తెలుగులో రాజుగారి గది 2, మహానటి సినిమాలు చేస్తుంది సమంత. ఇందులో రాజుగారి గది 2 చిత్రం థ్రిల్లర్ మూవీ కాగా ఇందులో సామ్ ఓ కీలక పాత్ర  చేయనుందట. ఇక సావిత్రి బయోపిక్ నేపథ్యంలో తెరకెక్కనున్న మహానటి చిత్రంలో సామ్ జమున పాత్రలో కనిపించనుందట. ఈ పాత్ర కొద్ది సేపు మాత్రమే ఉంటుందని తెలుస్తుంది.
Samantha Upcoming New Movies,
ఇప్పుడు నాగ శౌర్య ప్రధాన పాత్రలో ‘అమ్మమ్మగారి ఇల్లు’ అనే టైటిల్‌తో మూవీ రూపొందనుండగా అందులో కూడా సమంత స్పెషల్ రోల్ వేస్తుందని అంటున్నారు. అంటే సమంత ఇప్పటి వరకు తెలుగులో ఓకే చేసిన సినిమాలన్నీ కూడా ఓ స్పెషల్ రోల్ పాత్రలకు సంబంధించినవే. మరి లీడ్ రోల్ పాత్రలలో నటించేందుకు ఈ అమ్మడు ఎప్పుడు ఓకే చెప్తుంది అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు . మరి దీనికి సమంత త్వరలోనే సమాధానం ఇస్తుందా లేదా అనేది చూడాలి.

- Advertisement -