పాన్ ఇండియా సినిమాలో సమంత

383
samantha'
- Advertisement -

టాలీవుడ్ గొల్డెన్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న సమంత మరో భారీ ఆఫర్ దక్కించుకుంది. ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో తన సత్తా చాటిన సమంత ఇకపై బాలీవుడ్ లో అడుగుపెట్టనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్ తీయబోయే సినిమాలో సమంత నటించనుంది. ఈమూవీలో లేడీ ఓరియెంటెడ్ పాత్రను సమంత పోషించనుంది. పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. త్వరలోనే ఈమూవీకి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు చిత్రయూనిట్. ఈ మూవీని తెలుగు ,తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఆ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.

ఈమూవీకి దర్శకుడు ఎవరు అన్న విషయం తెలియాల్సి ఉంది. అంతేకాకుండా ఈమూవీకి సమంతకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. బాలీవుడ్ నుంచి వచ్చిన చాలా ఆఫర్లను తిరస్కరించిన సమంత తాజాగా ఈ లేడీ ఓరియేంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. తెలుగు,తమిళ్, మలయాళంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత బాలీవుడ్ లో తన సత్తాచాటనుంది. సమంత ప్రస్తుతం గ్లామర్ పాత్రలను పక్కన పెట్టి కథకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. తెలుగు,తమిళ్, కన్నడతో పాటు పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది సమంత.

- Advertisement -