టాలీవుడ్ లో మొన్నటి వరకు స్టార్ హీరోయిన్ రాణించిన ముద్దుగుమ్మ సమంత. కానీ అమ్మడు త్వరలోనే ఓ ఇంటిది కాబోతున్న సమంత పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని తెలిపింది. పైగా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. ఎంగేజ్ మెంట్ తర్వాత సమంత … మెగాప్రాజెక్టుపై సంతకం చేసిందన్న వార్తలు వెలువడ్డాయి. రాంచరణ్-సుకుమార్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్ మూవీలో నటించే అవకాశాన్ని కొట్టేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఈ ఊహగానాలకు చెక్ పెడుతు చెర్రీ- సమంత మూవీ విషయంపై క్లారిటీ వచ్చింది.
ఇక ఈ సినిమా మార్చ్ 20న షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. మరో రెండు వారాల్లోనే మెగా పవర్ స్టార్ సినిమా షూటింగ్ మొదలు కానుందన్న మాట. ఇప్పటికే ఈ విషయంలో సమంత నుంచి రామ్ చరణ్ కు క్లారిటీ కూడా వచ్చేసింది. అక్కినేని ఫ్యామిలీలో ప్రస్తుతమున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చెర్రీ – సుక్కూ సినిమా నుంచి తప్పుకోవాలని సమంత నిర్ణయం తీసుకుందని వార్తలు వెలువడ్డాయి. అఖిల్ – శ్రేయ భూపాల్ ల ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కావడంతో.. ఇప్పుడు చైతూ – సమంతల మ్యారేజ్ ను ముందుకు జరపాలని నిర్ణయించారని అందుకే సమంత … చెర్రీతో సినిమాకు నో చెప్పిందని వార్తలు వచ్చాయి.
అయితే, అవన్నీ పుకార్లేనని తెలిపోయింది. సుకుమార్ – రాంచరణ్ కాంబినేషన్‌లో వచ్చే సినిమాకి ఉన్న వాల్యూ దృష్ట్యా సమంత ఈ నిర్ణయం తీసుకుందట. పైగా సినిమా మరో రెండు వారాల్లో మొదలుకానుండగా.. తప్పుకోవడం అంటే యూనిట్ ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో అంతకంటే బాగా తెలుసు. శామ్స్ కు అసలే ప్రొఫెషనల్ అనే గుర్తింపు ఉంది. దీంతో ఇబ్బందులు ఉన్న చెర్రీతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట సమంత. తొలిసారి రామ్ చరణ్ – సమంత కాంబినేషన్ చూసేందుకు ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.