బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్‌ డేట్ ఖరారు..

203
Baahubali 2 trailer to launch at a grand event
- Advertisement -

దర్శకధీరుడు జక్కన్న విజువల్ వండర్ బాహుబలి. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటిపార్ట్ విజయవంతం కావటంతో  ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌‌’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ అప్పుడప్పుడు విడుదల చేస్తున్న పోస్టర్స్‌తో మరింతగా అంచనాలను పెంచేస్తోంది.

తాజాగా బాహుబలి 2 ట్రైలర్ ను వదలడానికి ఈ సినిమా టీమ్ రెడీ అవుతోంది. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను ముంబై వేదికగా విడుదల చేయనున్నారని సమాచారం. ముంబైలో జరగనున్న ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో రాజమౌళి .. ప్రభాస్ .. రానా .. అనుష్క .. తమన్నా పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ‘బాహుబలి 2’ పై ఉన్నభారీ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకోనుందనే విషయాన్ని ఈ ట్రైలర్ ద్వారా చెప్పేందుకు జక్కన్న సిద్దమవుతున్నాడట.

ట్రైలర్‌ నిడివి దాదాపు రెండున్నర నిమిషాలు ఉండబోతోందని, అన్ని భాషల్లోనూ ఒకేసారి ప్రచార చిత్రాన్ని ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో అనుష్క, రానా, తమన్నా కీలక పాత్రలు పోషించారు. మరోవైపు ఈనెలాఖరున గానీ, ఏప్రిల్‌ మొదటి వారంలో గానీ పాటల్ని విడుదల చేసే అవకాశాలున్నాయి.

- Advertisement -