స‌మంత రాఖీ క‌డ‌తాన‌ని బెదిరించింది

209
samantha naga chaitanya
- Advertisement -

ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ సాధించిన నాగ చైతన్య కృష్ణ ఆర్వి ముత్తు దర్శకత్వంలో, యుద్ధం శరణం అనే చిత్రంలో నటించాడు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విడుదలపై అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు సినిమా ప్రముఖులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కొద్ది రోజుల్లో సమంత-నాగచైతన్యలు పెళ్లి చేసుకోబోతున్నారన్న సంగతి తెలిసిందే. ఈ సంధర్బంగా తమ పెళ్లికి సంబంధించిన విషయాలు షేర్ చేసుకున్నాడు నాగచైతన్య. త‌మ ప్రేమ విష‌యం నాగార్జున‌, అమ‌ల‌ల‌కు చెప్ప‌క‌పోతే స‌మంత రాఖీ క‌డ‌తాన‌ని బెదిరించిన‌ట్లు ఆయ‌న చెప్పాడు.

nag samantha

2009లో `ఏ మాయ చేసావె` షూటింగ్ జ‌రుగుతున్న‌పుడు  ప్రేమ‌లో ప‌డ్డామన్న చైతూ.. త‌ర్వాత నుంచి తాము చాలా కాలం పాటు ప్రేమించుకుంటూనే ఉన్నామన్నాడు. కానీ ఆ విష‌యాన్ని ఇంట్లో చెప్ప‌లేదని. ఈ విష‌యం తెలిసి ఒక‌రోజు చాటింగ్‌లో ప్రేమ విష‌యం ఇంట్లో చెప్ప‌క‌పోతే రాఖీ క‌డ‌తాన‌ని స‌మంత బెదిరించిందని . ఆ భ‌యంతో వెంట‌నే ప్రేమ విష‌యం ఇంట్లో చెప్పానని చైతూ చెప్పాడు. వాళ్లు ఒప్పేసుకోవ‌డం మ‌న‌సు కుదుట‌ప‌డిందని నాగ‌చైత‌న్య వివరించాడు. యుద్ధం శ‌ర‌ణం సినిమాను వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నికేత్ బొమ్మి డీఓపీగా ప‌నిచేస్తుండ‌గా ‘పెళ్లి చూపులు’ ఫేమ్ వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -