రంగస్థలనాయికని చూశారా..?

221
samantha strikes sexy pose
samantha strikes sexy pose
- Advertisement -

సమంత.. అటు సినిమాల్లోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌. సమంత అందానికి.. నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా కావాల్సిందే. మోడలింగ్ రంగం నుండి గ్లామర్ ఇండస్ర్టీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు, అందాల ఆరబోత విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చింది. టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఎదిగి.. స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది సమంత. మరోవైపు సేవ కార్యక్రమాలలో సమంత బిజీగా ఉంది. ప్రత్యూష ఫౌండేషన్ పేరుతో ఓ స్వచ్ఛంద సేవా సంస్థ పలు సేవలు అందిస్తున్న ఈ బ్యూటీ తెలంగాణలో చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెల్సిందే.

తాజాగా ఓ మ్యాగ‌జైన్ కోసం స‌మంత ఓ ఫోటో షూట్ చేసింది. చేనేత వ‌స్త్రాల‌లో స‌మంత కొత్తగా.. హాట్‌గా కనిపిస్తుండగా.. త‌న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యూచ‌ర్ అంతా చేనేత వ‌స్త్రాల‌దే అనే కామెంట్ పెట్టింది. ఇప్పుడు సామ్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ఇక ఈ అమ్మ‌డు అక్టోబ‌ర్ 6 న నాగ చైత‌న్య‌తో వివాహం చేసుకునేందుకు సిద్ధ‌మైంది. గోవా వేదిక‌గా మూడు రోజుల పాటు వీరి వివాహం జ‌ర‌గ‌నున్న‌ట్టు స‌మాచారం. కాగా సమంత ప్రస్తుతం రామ్‌చరణ్‌తో రంగస్థలం సినిమాలో నటిస్తుంది. చేతిలో మరికొన్ని సినిమాలున్నాయి. పెళ్లిలోపు అన్నీ ఫినిష్ చేసుకొని.. ఓ రెండు నెలల పాటు హనీమూన్‌ టూర్‌కు ప్లాన్ చేసిందట సమంత…

- Advertisement -