సమంత డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?

454
Samantha Dress
- Advertisement -

వరుస విజయాలతో దూసుకుపోతుంది హీరోయిన్ అక్కినేని సమంత. మజిలీ, ఓ బేబీ సినిమాతో టాలీవుడ్ లో మరో సక్సెన్ ను తన ఖాతాలో వేసుకుంది. చిన్న పెద్ద హీరోలని తేడా లేకుండా అందరి సరసన నటిస్తూ విజయం సాధిస్తుంది. ప్రస్తుతం సమంత ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో భర్త నాగచైతన్యతో కలిసి ఎంజాయ్ చేస్తుంది.

అయితే తాజాగా నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా అక్కినేని ఫ్యామిలీ మొత్తం స్పెయిన్ కి వెళ్లారు. నాగార్జున 60వ పుట్టిన రోజు వేడుకలు అక్కడే చేసుకున్నారు. అఖిల్, నాగచైతన్య, సమంత, నాగార్జున అమల అక్కడ బర్త్ డే పార్టీని ఎంజాయ్ చేశారు.

ఆ ఫోటోలను ట్వీట్టర్ ద్వారా షేర్ చేసింది సమంత. బర్త్ డే పార్టీలో సమంత వేసుకున్న డ్రెస్ లో సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. నాగార్జున బర్త్ డే కోసం సమంత వేసుకున్న డ్రెస్ ఖరీదు అక్షరాల 2.లక్షల రూపాయలంట. మామ బర్త్ డే కోసం ఆమె స్పెషల్ గా రిజైన్ చేయించుకుందని సమాచారం.

- Advertisement -