“సాహో” ఫస్ట్ డే కలెక్షన్స్

332
Sahoo censor
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సాహో చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈచిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ నటించింది. భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ మూవీకి మొదటి రోజే మిక్స్‌డ్ రివ్యూస్ రావడం ప్రభాస్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరచింది.

చాలా మంది సినిమాకు అంత బడ్జెట్ అవసరం లేదని.. అసలు సినిమాలో కాన్సెప్ట్ సరిగ్గా లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఓపెనింగ్స్ వచ్చినా.. బాలీవుడ్, ఓవర్సీరీస్లో మాత్రం అనుకన్నంత మేర వసూళ్లను రాబట్టలేకపోయింది. యూవీ క్రియేషన్స్ వారు 350 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, టాక్ తో సంబంధం లేకుండా, ప్రపంచవ్యాప్తంగా తొలిరోజున 130 కోట్ల గ్రాస్ ను వసూలు చేయడం విశేషం.

వీకెండ్ కావడంతో మరో రెండు రోజులు ఇదే జోరు కొనసాగనుంది. వరుసగా మూడు రోజులు సెలవు ఉండటంతో కలెక్షన్ల పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు విశ్లేషకులు. బాలీవుడ్ నటులు జాకీష్రాఫ్‌, లాల్‌, అరుణ్‌విజయ్‌, నీల్‌నితిన్‌, మందిరాబేడిలు ముఖ్య పాత్ర‌లు పోషించారు. బాహుబలి లాంటీ భారీ హిట్ తర్వాత సాహో లాంటి ప్లాప్ మూవీ రావడంతో నిరాశలో ఉన్నారు అభిమానులు.

- Advertisement -