సమంత..శుభం!

10
- Advertisement -

శుభం అంటూ వచ్చేసింది నటి సమంత. చాలా కాలం తర్వాత తెలుగులో నటిగా అలాగే నిర్మాతగా సమంత చేసిన తొలి చిత్రమే శుభం . ప్రవీణ్ కాండ్రేగు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి భారీ హైప్ వచ్చింది.

సినిమాపై తమకు ఉన్న నమ్మకంతో మేకర్స్ ఏకంగా రెండు రోజులు ముందే ప్రీమియర్స్ ని తెలుగు రాష్ట్రాల్లో వేయడం విశేషం. ఈ ప్రీమియర్స్ నుంచి శుభం చిత్రానికి సాలిడ్ రెస్పాన్స్ రావడం జరిగింది.

దాదాపు అన్ని పైడ్ ప్రీమియర్స్ ఫుల్స్ అవ్వడమే కాకుండా షోస్ అయ్యాక మంచి రెస్పాన్స్ ని కూడా ఈ చిత్రం ఆడియెన్స్ నుంచి అందుకుంది. మే 9న ప్రేక్షకుల ముందుకు రానుండగా హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి తదితరులు కీలకపాత్ర పోషించారు.

Also Read:భారత్‌ – పాక్‌ దాడులపై ట్రంప్

- Advertisement -