RRB..దరఖాస్తులకు మరో మూడు రోజులే!

13
- Advertisement -

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(RRB) 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మే 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్ఆర్‌బీ వెల్లడించగా అప్లై చేసుకోవడానికి మరో మూడు రోజుల సమయం మాత్రమే మిగిలిఉంది.

మొత్తం పోస్టుల్లో దక్షిణ మధ్య రైల్వేలో 989 పోస్టులు ఉన్నాయి. టెన్త్‌తో పాటు ఐటీఐ, పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్‌ డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయో పరిమితి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఫస్ట్‌ స్టేజ్‌ సీబీటీ, సెకండ్‌ స్టేజ్‌ సీబీటీ, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికి అప్లై చేయని అభ్యర్థులు https://www.rrbapply.gov.in/లో అప్లై చేసుకోవచ్చు.

Also Read:భారత్‌ – పాక్‌ దాడులపై ట్రంప్

- Advertisement -