టాలీవుడ్ గొల్డెన్ హీరోయిన్ అక్కినేని సమంత వరుస సినిమాలతో బిజిగా గడుపుతోంది. ఇటివల ఆయె నటించిన రంగస్ధలం, మహానటి సినిమాలు భారీ విజయాలను తెచ్చిపెట్టాయి. పెళ్లి అయాక సమంత సినిమాలలో నటించదు అనుకున్నారు అందరూ. కానీ అందుకు విరుద్దంగా ఆమె పెళ్లి అయ్యాకనే ఎక్కువ సినిమాలతో బిజిగా ఉంది. ఈసందర్భంగా ఓ ఇంటర్యూలో ఆమె అందాల నటి సావిత్రి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహానటి సావిత్రి జీవిత కథకు, తన కథకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని తెలిపింది.
సావిత్రి జీవిత కథ విన్నాక..అది తన కథ లానే అనిపించిందిని చెప్పింది. సావిత్రిలానే నేను కూడా కొంతమంది గుడ్డిగా నమ్ముతానని…నేను కూడా చాలా మంది చేతిలో మోసపోయానంది. ప్రేమ విషయంలో కూడా నేను ఆమెలానే నమ్మానని, అయితే నా అదృష్టం బాగుండి నేను ఆలాంటి వారి నుండి తప్పించుకుని బయటపడ్డానని తెలిపింది. లేదంటే తన కథ కూడా సావిత్రి కథలానే అయి ఉండేదన్నారు. ఆ బాధ నుంచి తొందరగానే బయపడ్డానని తెలపింది.
నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల నాకూ చైతు దొరకడం చాలా అదృష్టంగా బావిస్తున్నానని తెలిపింది. సినిమాల్లో అవరసరమైతే రొమాన్స్ సిన్లకు సిద్దమేనని..కథకు అనుగుణంగా ఉంటే నటిస్తానని పేర్కొంది. పెళ్లి అయిన తర్వాత రొమాన్స్ సిన్లకు దూరంగా ఉంటున్నా అనే విషయం వాస్తవం కాదన్నారు. కథను బట్టి నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. తెరపై రోమాన్స్ చేయడం కూడా నటనేనని…నటనలో ఇవన్ని కామన్ అన్నారు. ఇకపై తాను నటించే ప్రతి సినిమాకు తానే డబ్బింగ్ చెప్పుకుంటానని తెలిపింది.