లండన్‌లో ఘనంగా తెలంగాణ అవతరణ సంబరాలు

199
anil kurma chalam trs

లండన్ లో ఎన్నారై టి.ఆర్.ఎస్.సెల్ యూకే అధ్వర్యంలో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో కార్యక్రమంలో ముందుగా తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ గారి చిత్ర పటానికి పూలతో నివాళుర్పించి, అమరవీరులని స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కేకును కట్ చేసి ఆనందోత్సాలతో ఆవతరణ వేడుకలు జరుపుకున్నారు.

ఈ సంధర్భంగా ఎన్నారై టి.ఆర్.ఎస్.సెల్ అధ్యక్షులు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ లండన్ లో తెలంగాణా రాష్ట్ర ఆవతరణ దినోత్సవాలు నాలుగవ సారి జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉంది అని , అమరవీరుల త్యాగఫలం తో,కెసిఆర్ గారి సారథ్యం తో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరుణంలో సీఎం కేసీఆర్ చేస్తున్న ఆభివృద్ధి పనులు,సంక్షేమ కార్యక్రమాలు విజయపథం లో దూసుకెళ్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

anil kurma chalam

ఉపాధ్యక్షులు శ్రీకాంత్ పెద్దిరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై పరిచయం చేయడానికి మా వంతు బాధ్యతతో కృషి చేస్తున్నామనీ, తెలంగాణా ఉద్యమంలో ఎన్నారై ల పాత్ర ఎనలేనిదని ఇక్కడ జరిగిన ఉద్యమానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు.

ఎన్నారై టి.ఆర్.ఎస్.సెల్ ఉపాధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు కొత్త కొత్త పథకాలతో ముందుకెళ్తూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి గారికి మా కృతజ్ఞతలు కెసిఆర్ గారి బంగారు తెలంగాణా సాధనకై అందరు తమవంతు కృషి చేయాలనీ ఆయన కోరారు.

nri trs

ఈ వేడుకల్లో ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ అద్యక్షులు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు అశోక్ దూసరి, నవీన్ రెడ్డి, శ్రీకాంత్ పెద్దిరాజు ,ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైసర్ బోర్డు సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి, సత్యం రెడ్డి కంది, సెక్రటరీ సృజన్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి మల్లా రెడ్డి మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్ జెల్ల ,యూకే & ఈయూ ఇంచార్జ్ విక్రమ్ రెడ్డి,IT సెక్రటరీ వినయ్ ఆకుల , లండన్ ఇంచార్జ్ సతీష్ రెడ్డి బండ ,ఈస్ట్ లండన్ కో ఆర్డినేటర్ రమేష్ యెసంపల్లి, నవీన్ మాదిరెడ్డి, ఈవెంట్స్ కో ఆర్డినేటర్స్ రవి ప్రదీప్,వెస్ట్ లండన్ ఇంచార్జ్ గణేష్ పాస్తం,సురేష్ బుడగం,నవీన్ భువనగిరి మరియు ముఖ్య సభ్యులు రవి కుమార్ రేటినేని,వెంకీ సుదిరెడ్డి,సతీష్ గొట్టిముక్కుల తదితరులు హాజరైన వారిలో వున్నారు.