2016-17 అక్కినేని నాగచైతన్య ఆయనకు కాబోయే సతీమణి సమంతకు కెరీర్ బెస్ట్ ఇయర్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ అక్కినేని హీరో `ప్రేమమ్` సినిమాతో మరపురాని విజయం అందుకున్నాడు. `సాహసం శ్వాసగా సాగిపో` చిత్రంతో చక్కని పెర్ఫామర్ అన్న టాక్ తెచ్చుకున్నాడు. ఇక ఇదే సీజన్లో చైతూ గాళ్‌ఫ్రెండ్, అక్కినేని కోడలు సమంత సైతం అదిరిపోయే బ్లాక్బస్టర్లు అందుకున్నారు. అ..ఆ సినిమాతో నటిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంది సమంత.
సంతోషం అవార్డ్స్ -2017 ఉత్సవాల్లో ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ప్రేమమ్), ఉత్తమ నటిగా సమంత (అ..ఆ) అవార్డులందుకున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాదులో ఏర్పాటు చేసిన సంతోషం అవార్డుల కార్యక్రమంలో సమంతకు ”అ.ఆ” సినిమాకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. ఈ ట్రోఫీ తీసుకోవడానికి సమంత బదులుగా నాగ చైతన్య వచ్చాడు. అల్లు అరవింద్ దగ్గర నుండి ట్రోఫీ అందుకున్నాడు. ఆ సమయంలో మాట్లాడుతూ.. ఇప్పటికే సమంతకు ఇల్లంతా అవార్డులే. హౌస్ ఫుల్ అయిపోయింది.
ఇప్పుడు ఈ ట్రోఫీ కూడా అక్కడికే చేరుతుంది.. అంటూ చలాకీగా చెప్పాడు. నిజమే కదా.. సమంత ఫిలింఫేర్లు అవీ ఇవీ చాలానే అవార్డులను గెలిచింది. ఎక్కువ ట్రోఫీలే ఉండుంటాయ్. అవన్నీ చూసి చెయ్ కూడా చాలా హ్యాపీ ఫీలవుతున్నట్లున్నాడు. సమంత, నాగచైతన్యల పెళ్లి వచ్చే అక్టోబర్ 6న గోవాలోని డబ్ల్యూ హోటల్లో సమంత అండ్ చైతన్యల పెళ్ళి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మధ్యన జరగనుంది.