మంచానపడ్డ సమంత…!

282
Samantha Ruth Prabhu About His Life
- Advertisement -

సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే సమంత ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితం పై విచిత్రమైన కామెంట్స్ చేసుకుంది. ప్రపంచంలో 7 వింతలు ఉంటే ఆ వింతలకు తోడుగా తన జీవితం 8వ వింత అని అంటోంది. దీనికి కారణం తన జీవితంలో జరిగిన ఆశ్చర్యకర సంఘటనలు అని అంటోoది సమంత.

‘ఏమాయ చేశావె’ చిత్రం తెలుగు ప్రేక్షకులతోపాటు అక్కినేని హీరోని మాయ చేసింది సమంత. కెరీర్‌ బిగినింగ్‌లో పరాజయాలు చూసినా తర్వాతర్వాత వరస విజయాల్ని తన ఖాతాలో వేసుకుంది. సక్సెస్‌ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా అవకాశాలు అందిపుచ్చుకుంది. ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో ఓ పదిహేను రోజులు తన జీవితంలో ఎంతో కీలకమైనవని చెబుతోంది. సమంత మాట్లాడుతూ ‘‘సౌత్ లో హీరోయిన్ గా బిజీగా ఉంటూ పాపులర్‌ అవుతున్న తరుణంలో ఓ పదిహేను రోజులు మంచానపడ్డాను.

ఆ పదిహేను రోజుల్లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాను. నాకు తెలియని వ్యక్తులు ఆ సమయంలో నాపై చూపించిన ప్రేమ చాలా గొప్పది. జీవితం అంటే ఏంటో పూర్తిగా అప్పుడే తెలుసుకున్నాను. ఏదీ శాశ్వతం కాదని గ్రహించాను. అందరితో ప్రేమానురాగాలతో మెలగాలని అర్థం చేసుకున్నా’’ అని చెప్పుకొచ్చింది.

Samantha Ruth Prabhu About His Life

ఇక తాను సినిమాలలోకి వస్తానని వచ్చినా సినిమా రంగంలో రాణిస్తానని తాను కలలో కూడ ఊహించుకోలేదు అని అంటోంది సమంత. అంతేకాదు తాను సినిమా రంగంలోకి వచ్చిన తరువాత తనకు వచ్చిన గుర్తింపు తాను పొందుతున్న సౌకర్యాలు తాను గణించిన డబ్బు ఇలా ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ నిజమేనా అని అనిపించడమే కాకుండా ఎదో ఒకరోజు తాను సంపాధించుకున్న ఇవన్నీ తన వద్ద నుండి మాయమైపోతాయేమోనని భయం తనను వెంటాడుతోంది అని అంటూ తన భయాలను బయట పెట్టింది సమంత.

అయితే వచ్చే సంవత్సరం ప్రారంభంలో నాగాచైతన్యను పెళ్ళి చేసుకోబోతున్న సమంత ఇలా వేదాంతం మాట్లాడుతూ తన జీవితం ఒక వింత అని తనకు తానే కామెంట్ చేసుకోవడం మరో వింతగా మారింది.

- Advertisement -