రేటు తగ్గించుకున్న సమంత….

305
- Advertisement -

తెలుగులో టాప్‌ హీరోయిన్‌లలో ఒకరు సమంత. స్టార్‌ హీరోలతో వరస బెట్టి ఛాన్సుల మీద ఛాన్సులు కొట్టిసేన సమంత…. పెళ్లి ఫిక్స్‌ అవడంతో ఆఫర్లు తగ్గిపోయాని టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే సపోర్టింగ్ రోల్స్ వస్తే… రెమ్యూనరేషన్ తగ్గించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని సంకేతాలు కూడా ఇస్తోందట ఈ భామ.

Samantha Reduces Remuneration

నాగ చైతన్యతో పెళ్లి ఫిక్స్‌ అయిన తర్వాత తెలుగులో సమంత జోరు తగ్గిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సమంత మాత్రం కావాలనే తెలుగు సినిమాలకు ఒప్పుకోవడం లేదా…లేక అక్కినేని ఇంటి కోడలుగా వెళ్లే హీరోయిన్‌తో రొమాన్స్‌ చేయడానికి స్టార్‌ హీరోలు ఆసక్తి చూపడంలేదా అనే విషయం మాత్రంపై సందేహం నెలకొంది. ఓ వైపు తమాళంలో వస్తున్న ఆఫర్లును ఓకే చేస్తున్న సమంత…తెలుగులో మాత్రం హీరోయిన్‌ కంటే ఎక్కువగా ప్రత్యేక పాత్రలో కనిపించడానికి ఆసక్తి చూపిస్తోందట. అలనాటి మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోయే సావిత్రి సినిమాలో టైటిల్‌ రోల్‌ కాకుండా మరో ముఖ్యమైన పాత్రలో కనిపించేందుకు ఓకే చెప్పిన ఈ అందాల భామ… తెలుగులో అలాంటి ముఖ్యమైన పాత్రల కోసం ఎదురు చూస్తోందని సమాచారం. అయితే హీరోయిన్‌గా కాకుండా ఇలాంటి పాత్రలు చేయడానికి రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని గమనించిన సమంత… మంచి రోల్స్ వస్తే పారితోషికం తగ్గించుకుంటానని సంకేతాలు పంపుతున్నట్టు ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Samantha Reduces Remuneration

అయితే ఏదో ఒక సినిమాలో సమంతకు సపోర్టింగ్‌ రోల్‌ దక్కినంత మాత్రాన….మిగతా సినిమాల్లోనూ అలాంటి అవకాశాలు వస్తాయని ఊహించలేమని పలువురు సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద డిఫరెంట్‌ రోల్స్‌కు రేటు తగ్గించాలని నిర్ణయించుకుందట సమంత. ప్రస్తుతం తమిళ్‌లో రెండు సినిమా ప్రాజెక్టులకు సమంతఒప్పుకున్నట్లు సమాచారం.

- Advertisement -